Wednesday, January 22, 2025

బిజెపి హస్తముంటే ఎందుకు అరెస్టు చేయలేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో బిజెపి హస్తముందంటూ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. శనివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘పేపర్ లీకేజీలో బిజెపి హస్తముంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అధికారంలో ఉన్నది మీరే కదా? మేం అడుగుతున్నా.. పేపర్ లీకేజీలో ఐటి శాఖ తప్పిదాలున్నాయి. అందుకే బర్తరఫ్ చేయాలని అడుగుతున్నాం. మీరు నిజంగా తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదు”అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు సమాధానమిచ్చాను. వాళ్లు నా స్టేట్ మెంట్ రికార్డు చేశారు.

వాళ్లు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానమిచ్చాను. తెలంగాణలోని సామెతను మాత్రమే ప్రస్తావిస్తూ చెప్పానే తప్ప నాకు మరో ఉద్దేశం లేదని వెల్లడించారు. బండి సంజయ్‌కు కామన్ సెన్స్ లేదంటూ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా… “ఎవరికి కామన్ సెన్స్ ఉందో… ఎవరికి లేదో ప్రజలకు తెలుసు. పరీక్ష సక్రమంగా నిర్వహించే తెలివిలేదు.. కామన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నడు. ఎవరి నిర్వాకంతో ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు చనిపోయారు? ధరణి వల్ల లక్షల మంది రైతులు ఎందుక ఇబ్బంది పడుతున్నారు? తన శాఖ పరిధిలోనే.. కుక్కపిల్ల కరిచి పిల్లలు చనిపోతే కనీసం పట్టించుకోనోడు…

నాలాల్లో పడి జనం చస్తే పట్టించుకోనోడు… సిటీలో ఫైర్ అయి చనిపోతున్నా పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నరని ఆరోపించారు. 2010 నుండి రాజశేఖర్ మీదగ్గరే పనిచేస్తేన్నరు కదా… ఇన్నాళ్లు ఎందుకు దొంగను దొరకపట్టలేదు? ఏదైనా సంస్థ ఎవరికైనా ఉద్యోగమిస్తే.. బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుని నియమించుకుంటది. మరి రాజశేఖర్ విషయంలో టిఎస్పీఎస్సీ ఇన్నాళ్లు ఏం చేసినట్లు? అని ఆయన ప్రశ్నించారు.
సోషల్‌మీడియాలో ప్రచారం అవాస్తవం
సమాజానికి మంచి జరిగే విషయాలు లీక్ ఇస్తే తప్పులేదు.. కానీ అందుకు భిన్నంగా లీకుల పే రుతో ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని బండి అన్నారు. ‘నా విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా నేను భావించడం లేదు. మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలని కోరారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చానని తెలిపారు’.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News