Thursday, January 23, 2025

నేరస్తులను కాపాడేందుకే సిట్ : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ వైఫ్యలంతోనే టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ జరిగిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కుమార్ ఆరోపించారు. పేపర్ లీకేజీపై జరిగిన ఆందోళనలో అరెస్ట్ అయి చంచల్ గూడ జైల్లో ఉంటున్న యువమోర్చా నాయకులను గురువారం బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పేపర్ లీకేజీ విషయంలో లక్షలాది యువత తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్ తోపాటు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి… జైలుకు పంపడం దుర్మార్గం అన్నారు. లీకేజీ నిదింతులకు రాచ మర్యాదలు చేస్తున్నరు. రాజు అనే కార్యకర్తకు పసిపిల్లలున్నరు.

వాళ్ల ఆలనాపాలనా చూసుకోవాలి… ఆయన తప్పు చేయకపోయినా ఆందోళనలో పాల్గొన్నందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అన్యాయం.జైళ్లు, కేసులు యువమోర్చా, బిజెపికి కొత్త కాదన్నారు. టిఎస్పీఎస్సీ చైర్మన్‌కు తెలియకుండా ఎట్లా పేపర్ లీకైంది? ముందు వాళ్లను ప్రాసిక్యూట్ చేయాలి. నేరస్తులను కాపాడుకునేందుకే సిట్ వేశారు. మియాపూర్ భూములు, డ్రగ్స్, నయీం కేసులపై వేసిన సిట్‌లు ఏమయ్యాయి? కెసిఆర్ సిట్ అంటే సిట్…. స్టాండ్ అంటే స్టాండే.. అని అన్నారు. నాతో ప్రతి రోజు వెయ్యి మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు. వాళ్లందరితో నాకు సంబంధం ఉన్నట్లా? మీకు బయటకు రావడం చేతగాదు.. ప్రజలను కలవడం చేతగాదు అన్నారు.

లీకేజీ దోషులను శిక్షించాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేయడంపట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎస్సీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News