Sunday, February 2, 2025

విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రం లీకేజీ కావడం దురదృష్టకరం.. లీకేజీ సర్వసాధారణంగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పదోతరగతి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించ లేకపోవడం సిగ్గుచేటు. అధికారుల తీరు విద్యార్థుల జీవితాలకు శాపంగా మారింది.

పేపర్ లీకేజికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ చేశారు. మిగిలిన పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ లీకేజీ బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News