- Advertisement -
నేషనల్ హెరాల్డ్ కేసుతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి రూ.2 వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ కాజేసే ప్రయత్నం చేసిందన్నారు. ఈ వ్యవహారంలో 2011లోనే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే సీబీఐ దర్యాప్తు ప్రారంభమైందని చెప్పారు. కేసు నమోదైనప్పుడే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్ పొందారని తెలిపారు. భారత చట్టాలు, సోనియాగాంధీ రాహుల్‌గాంధీకి వర్తించవా? బండి సంజయ్ ప్రశ్నించారు.
కాగా, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ చార్జీషీటు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బిజెపి కక్ష రాజకీయాలకు పాల్పడుతోందని..కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
- Advertisement -