Thursday, January 23, 2025

బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యారు. నిన్న రాత్రి హనుమకొండ కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బెయిల్ కు సంబంధించిన ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసి కరీంనగర్ జైల్ అధికారులకు అందజేశారు. ఈరోజు ఉదయం 6 గంటల నుండి జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఊరేగింపులు సమావేశాలకు అనుమతి లేదని సిపి సుబ్బారాయుడు తెలిపారు. బండి విడుదల సమయంలో బిజెపి లీగల్ టీం, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ అతని వెంట ఉన్నారు.

కరీంనగర్ ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ ఆర్డర్ కరీంనగర్ జిల్లా జైలు అధికారులకు అప్పగించారు. ఆర్డర్ కాపీని జైలు ఆవరణలోని బెయిల్ బాక్స్ లో వేశారు. కరీంనగర్ లోక సభ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావుతో పాటు పలువురు నాయకులు బెయిల్ ఆర్డర్ ను తీసుకెళ్లారు. వరంగల్ కోర్టు గురువారం రాత్రి బండి సంజయ్ కి బెయిలు ఇస్తూ నిర్ణయం తీసుకోగా ఆర్డర్ కాపీని శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు బాక్సులో వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News