Wednesday, January 22, 2025

కెటిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తనకు ఇచ్చిన లీగల్ నోటీసులో నిరాధారమైన ఆరోపణలు చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్, మాదక ద్రవ్యాల అంశంలో తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని కెటిఆర్ ఇటీవల బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లోగా తనకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో న్యాయమైరమైన చర్యలు తీసుకుంటానని కెటిఆర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఇందుకు బండి సంజయ్ జవాబిస్తూ తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని తెలిపారు. దురుద్దేశ్యపూర్వకంగానే తనకు లీగల్ నోటీసులు ఇచ్చారని అన్నారు. తనకు వారం రోజుల్లోగా కెటిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే తాను కోర్టుద్వారానే తేల్చుకుంటానని తెలిపారు.

డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో ఏపిలో అభివృద్ధి రెట్టింపు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి రెట్టింపు అవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం జరిగిన రోజ్‌గార్ మేళాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించే మా లక్ష్యంలో భాగంగా 110 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేశామని అన్నారు. ప్రధాని మోడీ హయాంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం నుండి ఐదవ అతిపెద్ద స్థానానికి పెరిగిందని వెల్లడించారు. ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ దృష్టి, మనల్ని మరింత స్వావలంబన చేసేలా చేస్తుందని పేర్కొన్నారు.

రాజకీయాలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ఆంధ్రా అభివృద్ధికి కృషి చేయాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుందని సంజయ్ తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీలో కేటీఆర్, హరీశ్‌రావుల మధ్య పంచాయతీ నడుస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్, కేటీఆర్, హరీశ్‌రావు (ఆర్‌కెహెచ్) ప్రభుత్వం నడుస్తోందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల మందు దందాలో దొరికితే, బీఆర్‌ఎస్ నేతలు ధర్నాలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసింది కాక, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు కేసీఆర్ లేకపోతే కేటీఆర్‌ను ఎవరూ పట్టించుకోరని అన్నారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, పేదలను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్‌ఎస్ పార్టీలను వెంటాడి, వేటాడి నామరూపాలు లేకుండా చేస్తామని బండి సంజయ్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News