- Advertisement -
హైదరాబాద్: టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడుకు కరీంనగర్ టిటిడి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఈ విషయంపై బండి సంజయ్ లేఖ రాశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..2023 లోనే కరీంనగర్ లో టిటిడి ఆలయానికి అనుమతి లభించిందని, 2023 మే 31న కరీంనగర్ లో 10 ఎకరాల స్థలంలో భూమి పూజ జరిగిందని గుర్తు చేశారు. కానీ నిర్మాణం విషయంలో రెండేళ్ల నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టిటిడి ఆలయ నిర్మాణం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇక ముందైనా ఆలయం పనులు యుద్ధప్రాతికన జరిపించండని బండి సంజయ్ కోరారు.
- Advertisement -