Friday, December 20, 2024

రేవంత్ బలిపశువు కావడం ఖాయం: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బిజేపి నేత బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ లో రేవంత్ బలిపశువు కావడం తప్పదన్నారు. ఇటీవల కొందరు ముస్లిం మతపెద్దలు రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసి, మద్దతు ప్రకటించినట్లు తనకు తెలిసిందని సంజయ్ చెప్పారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయబోమని హామీ ఇస్తేనే తాము మద్దతు ఇస్తామని అన్నారని, అందుకు రాహుల్ గాంధీ కూడా సరేనన్నట్లు తనకు తెలిసిందని సంజయ్ చెప్పారు.

పాపం అంతో ఇంతో కష్టపడుతున్న రేవంత్ రెడ్డికి చివరకు కాంగ్రెస్ మొండిచెయ్యి చూపిస్తుందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కదని తెలిసి కాంగ్రెస్ లో అందరూ చంకలు గుద్దుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ లో జనం గురించి ఆలోచించే నేతలు ఎవరూ లేరనీ, ఎవరికివారు ముఖ్యమంత్రి కావాలనే కొట్లాడుకుంటున్నారని సంజయ్ అన్నారు.

బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని తాము అంటే అందరూ తమను అవహేళన చేస్తున్నారనీ, కానీ బీసీల పట్ల నిబద్ధత కలిగిన పార్టీ బీజేపి ఒక్కటేనని సంజయ్ చెప్పారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత మోదీదేనన్నారు. తాను కరీంనగర్ నుంచి సోమవారం నామినేషన్ వేయనున్నట్లు సంజయ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News