- Advertisement -
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో సన్నబియ్యం ఇస్తే.. మరి దేశమంతా ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. సొంత పార్టీలో గుర్తింపు కోసం, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం బండి ఆరాటపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి బండి సంజయ్‌కి కనిపించడం లేదా అని అడిగారు. రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు ఉండటం వల్లే బిసి రిజర్వేషన్, ఎస్సి వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాయని అన్నారు. హెచ్‌సియూ అంశాన్ని రాజకీయ అవసరాల కోసం మాట్లాడటం సరైంది కాదని స్ఫష్టం చేశారు. బండి సంజయ్‌కి రోజురోజుకీ అభద్రత భావం పెరిగిపోతోందని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తే.. సహించేది లేదని హెచ్చరించారు.
- Advertisement -