Sunday, April 13, 2025

కెటిఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి,మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.. ఇద్దరు జాన్ జబ్బలు అని అన్నారు.
ఇద్దరూ కలిసే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలోని బిఆర్ఎస్ నాయకులు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరినీ జైలుకు పంపిస్తానని అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు జైలుకు పంపడంలేదని ప్రశ్నించారు.

కెటిఆర్ పై పలు కేసులు నమోదైనా.. చర్యలు తీసుకోవడంలేదని.. అసలు కెటిఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి అని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరూ కలిసే మజ్లిస్‌ను గెలిపించేందుకు సిద్దమయ్యారన్నారు. తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా కెటిఆర్ కు బుద్ధి మారలేదని బండి సంజయ్‌ ఫైరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News