Sunday, January 19, 2025

బండి సంజయ్ సంచలనాత్మక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని వ్యాఖ్యానించారు. మాజీ సిఎం కెసిఆర్ ఓ ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా కెసిఆర్ పదేళ్ల పాలన అవినీతిపై దర్యాప్తును కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగనీయడం లేదన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకలకు కెసిఆర్ ను ఆహ్వానించిన కాంగ్రెస్ ఎందుకని బిజెపి నేతలను ఆహ్వానించలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగోలో చార్మినార్ ఉండొద్దన్నది తమ పార్టీ విధానమని, ఇప్పుడు కూడా దానికే తాము కట్టుబడి ఉన్నామని బండి సంజయ్ అన్నారు. కెసిఆర్ తన పదేళ్ల పాలనలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ఇదిలావుండగా మరో మూడు రోజుల్లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న వేళ…కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ విలీనం అంటూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News