Monday, December 23, 2024

కుట్రలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

కేసీఆర్ పై బిజేపి ఎంపి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ తో టచ్ లో ఉన్నారన్నారు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చని సంజయ్ అన్నారు.

కేసీఆర్ కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని ఆయన కాంగ్రెస్ నేతలకు సలహా ఇచ్చారు. అభివృద్ధి జరగాలంటే  బీజేపీ ఎంపీలు ఎక్కువమంది గెలవాలన్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలు ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News