Sunday, December 22, 2024

కెసిఆర్, కెటిఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెసిఆర్ కంటే ఎక్కువగా అధికారం చలాయించింది కెటిఆరే అని బిజెపి మాజీ అధ్యక్షడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కెసిఆర్ కంటే ఎక్కువ దాదాగిరి, గూండాగిరి కెటిఆరే చేశారు. సిరిసిల్లలో సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. సిరిసిల్లలో నేతన్నల దీన పరిస్థితికి కెసిఆర్, కెటిఆరే కారణమని ఆయన తెలిపారు. నేతన్నలకు బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టారని విమర్శించారు.

నేతన్నకు 50 శాతం విద్యుత్ రాయితీ ఇస్తామని మోసగించారని మండిపడ్డారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పరస్పర దూషణలకు దిగుతున్నాయన్నారు. నేతన్నల బకాయిల చెల్లిస్తామని కాంగ్రెస్ మోసగించిందని బండిసంజయ్ ద్వజమెత్తారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ మోసగించినందునే ప్రజలు బిజెపికి మద్దతుగా నిలిచారని చెప్పారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కూడా గెలిచాక పలు రూపాల్లో దోపిడీకి ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ మాయమాటలను ప్రజలు నమ్మవద్దని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News