Thursday, January 23, 2025

కొత్త సచివాలయంలో అడుగుపెట్టను: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూతన సచివాలయం హిందువుల మనోభావాలకు విరుద్ధంగా నిర్మించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందినా వెళ్లనని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఓ వర్గం ఓట్ల కోసమే సచివాలయ నిర్మాణ విధానం ఉందని, తాము అధికారంలోకి వచ్చాక ఆకారంలో మార్పులు చేస్తామని తెలిపారు. సచివాలయంలో హిందువుల వాటా రెండు గుంటలేనని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా మార్పులు చేసిన తర్వాతే సచివాలయానికి తాను వెళ్తానన్నారు.

Also Read: ఢిల్లీ మెట్రోలో వ్యక్తి హస్త ప్రయోగం: అరెస్టుకు మహిళా కమిషన్ ఆదేశాలు

కర్ణాటకలో బిజెపి గెలుపు తథ్యం…
చింతామణి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన బండి సంజయ్ అనంతపురంలో ఎస్‌సి మోర్చా నాయకులు ఘన స్వాగతం పలికారు. కర్ణాటక రాష్ట్రంలో బిజెపికి మళ్లీ అధికారం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దళిత, గిరిజన, బిసిల అభ్యున్నతికి పాటుపడుతున్న పార్టీ బిజెపి మాత్రమే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News