Sunday, November 24, 2024

బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వండి: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి పార్టీకి తెలంగాణ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా, మానకొండూరు ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వికారాబాద్ జిల్లా, పరిగి ప్రాంతానికి చెందిన వన్నె ఈశ్వరప్పతో పాటు ప్రజా ప్రతినిధులు ఎంపిలు డా.లక్ష్మణ్, బండి సంజయ్, ఆయన సమక్షంలో బిజెపిలో చేరారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వాన్ని మెచ్చి ఆరేపల్లి మోహన్ బిజెపి చేరడం చాలా సంతోషంగా ఉందని జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. నిజమైన నాయకులు పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ఒక్కటేని ప్రజలు నమ్ముతున్నారు. మా అభ్యర్థుల జాబితా ఢిల్లీకి వెళ్లింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రగతిభవన్ కు వెళ్లింది. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, మజ్లిస్ కలిసి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాయని సంజయ్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News