Wednesday, December 25, 2024

సంతకాలు లేకుండా ప్రధానికి కెసిఆర్ లేఖ: బండి సంజయ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంతకాలు లేకుండా వివిధ పార్టీల నేతల, ముఖ్యమంత్రుల సంతకాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ పంపినట్లుగా మీడియాకు విడుదల చేయడం హాస్యాస్పదమని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కవితపై ఆరోపణలొస్తే.. దీనిపై సిఎం కెసిఆర్ ఇంత వరకు స్పందించలేదు.

ఇంతవరకు మాట్లాడని సిఎం.. సిసోడియా పేరుతో బిడ్డను కాపాడేందుకు కొత్త డ్రామాకు తెరలేపిండని ఆరోపించారు. సంతకాలు లేకుండా లెటర్ రిలీజ్ చేయడంలో మీ ఆంతర్యమేమిటి?అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, కోశాధికారి బండారి శాంతికుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News