Thursday, January 23, 2025

సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర.. అసెంబ్లీలో ఓవైసితో ప్రశ్న అడిగించి మరీ..

- Advertisement -
- Advertisement -

అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లు సిఎం రేవంత్ వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాన్ ప్రకారమే.. అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ తో ప్రశ్న అడిగించి.. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారని విమర్శించారు.

“థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరం. దాన్ని అందరూ ఖండించారు. బాధిత కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారు. గాయపడిన బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ ఘటనలో నేరుగా సంబంధం లేకపోయినా అల్లుఅర్జున్ అరెస్టు చేసి.. హైకోర్టు బెయిల్ ఇచ్చినా విడుదల చేయకుండా కక్ష్య పూరితంగా ఒకరోజు జైలులో ఉంచారు. సద్దమనిగిన వివాదాన్ని.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ తో ప్రశ్న అడిగించి.. మళ్లీ సమస్య సృష్టించార” అని ఫైరయ్యారు. “రాష్ట్రంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతే.. వారి కుటుంబాలను సిఎం రేవంత్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదు. వారి మరణాలకు కారణం మీరు కాదా?.. మీకో న్యాయం.. ఇతరులకో న్యాయమా?” అని ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News