Monday, January 27, 2025

రేవంత్.. ఆ కేసులన్నీ ఏమయ్యాయి: బండి సంజయ్ ఫైర్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. గత పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎం చేశారో.. ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కూడా అలాంటి పనులే చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్ మేయర్ సునీల్ రావు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతోపాటు మరో 10మంది కార్పొరేటర్లు కూడా కమలం తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పేరిట కాలక్షేపం చేస్తుందని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ నేతలపై పెట్టిన కేసులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నాయన్నారని.. ఇప్పుడు దాని ఊసే లేదన్నారు. ఇక, ఈ ఫార్ములా కారు రేసు కేసు ఏమైందని నిలదీశారు. ఫామ్‌హౌస్‌ కేసు విచారణ ఏమైందని.. ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని బండి సంజయ్‌ ఫైరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News