Sunday, December 22, 2024

మోడీ రాకను అడ్డుకోవడం సమంజసం కాదు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకోవాలని పిలుపునివ్వడం సమంజసం కాదని బిజెపి చీఫ్ బండి సంజయ్ కుమార్ అన్నారు. అందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని ఆయన కోరారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేసి శక్తివంతమైన భారత్‌ను నిర్మించాలన్నదే ప్రధాని మోడీ లక్షమని ఆయన చెప్పారు. బుధవారం రామగుండంలో ఎరువుల కర్మాగారం, ప్రధాని మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర ఎరువులు, రసాయనిక శాఖ సహాయమంత్రి భగవంత్ ఖూబాతో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. రామగుండం ఎరువుల కర్మాగారం పునఃప్రారంభం తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు.

రాష్ట్రంలో ఎరువుల కొరత ఉండరాదనే లక్షంతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఈనెల 12న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రంలోని మూడు జాతీయ రహాదారుల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. కొత్తగూడెం-సత్తుపల్లి గూడ్స్ రైలును జాతికి ప్రధాని మోడీ అంకితం చేస్తారని చెప్పారు. మోడీ పర్యటనను రైతుందరూ వీక్షించేలా 75 నియోజకవర్గాల్లో ఎల్‌సిడి స్క్రీన్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కేంద్రమంత్రి భగవంత్ ఖుబా మాట్లాడుతూ.. దేశంలో మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను కేంద్రం పునరుద్ధరిస్తుందని చెప్పారు. అందులో భాగంగా రామగుండంలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో ఈ కర్మాగారాన్ని ప్రధానమంత్రి మోడీ జాతికి అంకితం చేయనున్నారని ఆయన తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా ఏటా 12.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుందని అన్నారు.

నేటి నుంచి అన్ని మండలాల్లో బిజెపి రైతేరాజు
బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి రైతేరాజు అనే కార్యక్రమాన్ని బిజెపి చేపట్టనుంది. ఒక్కో మండల కేంద్రంలో కిలోమీటరు మేర రైతులతో ర్యాలీ నిర్వహించునున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేయడంలో కేంద్రం ఉద్దేశ్యాన్ని ప్రజలకు వివరిస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. అలాగే రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు.

Bandi Sanjay slams CPI to Plan protest against PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News