Thursday, January 16, 2025

సినిమా ఎప్పుడూ భావోద్వేగాల యుద్దభూమే: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః సినిమా ఎప్పుడూ భావోద్వేగాల యుద్దభూమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశభక్తి, ఐక్యతను సినిమా ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తాజాగా స్పందించారు. సినిమా వాళ్లు చేసేది పక్కా బిజినెస్ అని, వాళ్లేమైనా సరిహద్దుల్లో సైనికుల వలే యుద్ధాలు చేస్తున్నారా అంటూ సిఎం చేసిన వ్యాఖ్యలను తిప్పి కొడుతూ దేశభక్తి కేవలం సరిహద్దుల్లోనే కాదు, ప్రజల్లో స్ఫూర్తి నింపడంలో కూడా ఉంటుందని బండి సంజయ్ పేర్కొన్నారు. అనేక సినిమా పాటలు దేశాన్ని కదిలించాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అల్లు అర్జున్‌ను కావాలనే అరెస్టు చేశారని, ఆయన విషయంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని బండి సంజయ్ తెలిపారు.

అల్లు అర్జున్ అరెస్టు వెనుక అత్యుత్సాహం: ఎంపి కొండా
హీరో అల్లు అర్జున్ అరెస్టు వెనుక అత్యుత్సాహం కనిపిస్తోందని బిజెపి ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పేమి లేదన్న ఆయన బెయిల్ వచ్చాక కూడా అల్లు అర్జున్‌ను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. దీని వెనుక రాజకీయ ఒత్తిడి, రాజకీయ కక్ష ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 90 శాతం తెలంగాణ అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతోందని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. 6 గ్యారెంటీలు విఫలం, హైడ్రాతో బుల్డోజింగ్, నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఇలా రోజు రోజుకు కాంగ్రెస్ ప్రజా విశ్వాసాన్ని పోగొట్టుకుంటోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News