Thursday, December 26, 2024

ఉపాధ్యాయుల డిమాండ్ల పరిష్కరించాలి: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధాయుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. 317 జీవోను సవరించాలని కోరుతూ గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల పట్ల పోలీసులు అనుసరించిన తీరు అమానుషమని అన్నారు.

అరెస్టు చేసిన ఉపాధ్యాయులను భేషరతుగా విడుదల చేయాలన్నారు. భార్యభర్తలకు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించమనే టీచర్ల డిమాండ్‌లో తప్పు ఏముందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే 317 జీవోను రద్దు చేస్తామని బండి సంజయ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News