Monday, December 23, 2024

మోడీ పాలనపై ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: 8 ఏళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలకు సంబంధించి ప్రత్యేక గీతాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆ పార్ట రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఎనిమిది  ఏళ్ల సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ పేరిట నరేంద్రమోదీ ప్రభుత్వ 8 ఏళ్ల పాలనా విజయాలకు సంబంధించి ప్రత్యేక వెబ్ సైట్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోడీ 8 ఏళ్ల పాలనా విజయాలకు సంబంధించి పాకెట్ డైరీ, కరపత్రాలను ఆవిష్కరించారు.  వివిధ రంగాల్లో నైపుణ్యం కనబరిచిన పద్మశ్రీ గోవర్దన్, చింతకింద మల్లేశం, దుశ్చర్ల సత్యనారాయణ, శశాంక్ రెడ్డి సహా పలువురికి మెమొంటోలను అందజేసి ఘనంగా బండి సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News