Sunday, December 22, 2024

పులి వచ్చింది.. వేట మొదలైంది: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

చేవెళ్ల: బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. బిజెపి పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఆదివారం చేవెళ్లలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభ జరిగింది. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… బిజెపికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిజెపికి అవకాశమిస్తే రైతులను ఆదుకుంటాం. ఉద్యోగులకు ఒకటో తేదీకే జీతాలు ఇస్తాం. తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా బిజెపి అండగా ఉంటుందన్నారు. హిందీ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో నన్ను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారు. 8 గంటలు రోడ్ల మీదే తిప్పారని ఆయన గుర్తుచేశారు. అమిత్ షాను ఉద్దేశిస్తూ పులి వచ్చింది.. వేట మొదలైందని సంజయ్ పేర్కొన్నారు.

ఈ సభలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, పార్టీ వ్యవహారాల బాధ్యులు తరుణ్ చుగ్, మురళీధర్‌రావు, అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఎవిఎన్ రెడ్డి మాజీ మంత్రి చంద్రశేఖర్, ప్రేమేందర్‌రెడ్డి, బొక్క నర్సింహారెడ్డి, వీరేందర్‌గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బాబుమోహన్, జిల్లాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News