Monday, December 23, 2024

ఆర్టీసీ చరిత్రను తిరగరాస్తాం: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధికారంలోకి రాగానే సమ్మె సమయంలో చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకుంటామని, ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో భారతీయ మజ్జూర్ సంఘం (బిఎంఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీని వ్యూహాత్మకంగానే రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీయిస్తూ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సింగరేణి.

Also Read: కాలింగ్‌బెల్ కొట్టారని కోపంతో ముగ్గురి పిల్లల హత్య

విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులంతా ఏకం కావాలని, తెలంగాణ ఉద్యమం నాటి తెగువను చూపాలని ఆయన కోరారు. కేసులు పెట్టినా, ఉద్యోగాల నుంచి తొలగించినా భయపడొద్దన్నారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తే 5 నెలలు లాంగ్ లీవ్ పెట్టామనుకోవాలని బండి సూచించారు. తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని, తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. బడ్జెట్‌లో ఆర్టీసికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి..
పూర్వవైభవం తెస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News