Wednesday, January 22, 2025

అన్ని పేపర్ల లీకులకూ బండి సంజయే కారణమని చెబుతున్నారు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

వరంగల్: వరంగల్ లో బిజెపి నిరుద్యోగ మార్చ్ కార్యక్రమం జరుగుతోంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బిజెపి రాష్ట్ర అథ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని పేపర్ల తీకులకూ బండి సంజేయే కారణమని చెబుతున్నారు. ప్రజల సమక్షంలో సమాధానం చెప్పక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇంట్లో కార్యక్రమం ఉందని చెప్పినా అరెస్ట్ చేశారు. కెసిఆర్ ఇంట్లో వారంతా దందాలు చేస్తున్నారని ఆరోపించారు. టిఎస్ పిఎస్ సి తప్పు లేకుంటే సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

తప్పు లేకపోయిన ఈటలను బయటకు పంపారని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత భవిష్యత్తు కోసం బిజెపి పోరాడుతోందన్నారు. ఈడీ విచారణ అంటే చాలు… అనేక సాకులు చెబుతారని ఆయన తెలిపారు. 30 లక్షల మంది యువత ఇబ్బందిపడితే ప్రగతి భవన్ నుంచి బయటకు రారు.. రైతులు, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న కెసిఆర్ స్పందిచరని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో బాధలుప డి హైదరాబాద్ వస్తారు. ఉద్యోగాల పేరుతో కెసిఆర్ యువతను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News