- Advertisement -
రాష్ట్రంలో సర్పంచ్‌లు తమ సమస్యల పట్ల ఆందోళన చేస్తుంటే పట్టించుకోరా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మ్యానిఫెస్టోను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో 73వ, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం, స్థానిక సంస్థల మూడంచెల వ్యవస్థకు బాధ్యతలు, నిధులు, స్థానిక అభివృద్ధి పనుల నిర్వహణను అప్పగించడం ద్వారా పంచాయతీల గత వైభవంతో పునరుజ్జీవింపబడుతుందని చెప్పినట్లు బండి గుర్తు చేశారు. అందుకు విరుద్దంగా ఇప్పుడు ఆ హామీలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
- Advertisement -