Monday, December 23, 2024

10 వేల మంది బూత్ కమిటీ అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా నేతలతోనూ ప్రత్యేకంగా భేటీ అయిన బండి సంజయ్
అమిత్ షా సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : “భారతీయ జనతా పార్టీకి అసలు సిసలైన బాస్ లు మీరే… రాష్ట్రంలో ఈసారి బిజెపికి అవకాశం ఇవ్వాలనే భావన ప్రజల్లో ఏర్పడిందంటే మీరు చేస్తున్న ఉద్యమాలే కారణమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 14న తుక్కుగూడలో జరగబోయే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ తెలంగాణలో మార్పుకు సంకేతం కాబోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా రాబోతున్న ఈ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేద్దాం. ఈ సభకు మీతో పాటు మీ పోలింగ్ బూత్ నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, పార్టీ అభిమానులు తరలివచ్చేలా ఏర్పాట్లు చేసుకోండి”అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఈనెల 14న జరగబోయే పాదయాత్ర ముగింపు సభ విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జన సమీకరణపై ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన దాదాపు 10 వేల మంది పోలింగ్ బూత్ అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ “ఈరోజు కేంద్రంతోపాటు 18 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిందంటూ పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు చేసిన కృషియే కారణం. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి పోలింగ్ బూత్ అధ్యక్షులే కారణమని సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ కూడా పలుమార్లు చెప్పిన విషయం గుర్తుంచుకోండి”అని చెప్పారు.

ప్రజల్లో బిజెపికి అధికారం ఇవ్వాలనే చర్చ జరుగుతోందని… ఈ నేపథ్యంలో మార్పుకు సంకేతంగా నిలిచేలా పాదయాత్ర ముగింపు సభకు కనీవినీ ఎరగని రీతిలో భారీ ఎత్తున జనాన్ని సక్సెస్ చేయాలని కోరారు. పాదయాత్ర సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా సోషల్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం చేయాలని సూచిం చారు. అనంతరం రంగారెడ్డి జిల్లా నేతలతో పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద బండి సంజయ్ ప్రత్యేకంగా సమావేశమై పాదయాత్రకు భారీ ఎత్తున జనం తరలివచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News