Friday, December 20, 2024

ఉచిత విద్య, వైద్యం హామీకి కట్టుబడి ఉన్నాం: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉచిత విద్య, వైద్యం హామీకి కట్టుబడి ఉన్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం బండి సంజయ్ కుమార్ కామెంట్స్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి  దర్వించుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ”అమ్మవారి కరుణ, కటాక్షం కలిగించించే అవకాశం కల్పించిన స్వర్గీయ పిజెఆర్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. రాజకీయాలు ఏం మాట్లాడాల్సి వచ్చినా పిజెపి లేకుండా మాట్లాడలేము. అంతగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత పాదయాత్రలో 31 రోజుల్లో 383 కిమీ పూర్తి చేసుకున్నాం. ఎండటెండలో పాదయాత్ర చేశాం. ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చి విజవంతం చేసినందుకు మీరందరికి ధన్యవాదాలు. అమిత్ షా రాకతో ప్రతి కార్యకర్తలో జోష్ వచ్చింది. అమిత్ షా సందేశం కొన్ని రాజకీయ పార్టీలకు ఒక చెంపపెట్టు లాంటిది. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల్లో ఒక స్పష్టత వచ్చింది. ఉచిత విద్య, వైద్యం అనే హామీకి కట్టుబడి ఉన్నాం. ప్రజల నుంచి పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నాం. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నాం. చాలా పేదరికంతో ఎంతోమంది గుడిసెల్లో జీవిస్తున్నారు. లక్షల మందికి ఇండ్లు కూడా లేని పరిస్థితి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. నిలువ నీడలేని అర్హులైన పేదలందరికి ఇండ్లను నిర్మించి ఇస్తాం. బీజేపీ అధికారంలోకి రావాలని పేదలందరు కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. వ్యాట్ ను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తాం. ఫసల్ భీమా యోజన అమలు చేస్తాం” అని అన్నారు.

Bandi Sanjay visit Peddamma Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News