Friday, December 27, 2024

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

దేశంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నారాయణపేట జిల్లా, నర్వ మండలం, రాయికోడ్ గ్రామాన్ని ఎంపి డికె అరుణ, ఎంఎల్‌ఎ వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి ఆయన గురువారం సందర్శించారు. గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ అస్పిరేషనల్ కార్యక్రమం ద్వారా సంపూర్ణ అభియాన్ కింద అత్యంత వెనుకబడిన ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. అందులో భాగంగా 2018లో 112 జిల్లాలను గుర్తించగా తెలంగాణ రాష్ట్రంలో మూడు జిల్లాలోని పది మండలాలను గుర్తించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలతో అభివృద్ధ్ది చేసేందుకు సంపూర్ణ అభియాన్ కింద నర్వ మండలం ఎంపికైందని తెలిపారు.

ఇందులో భాగంగా రాయికోడ్ గ్రామంలో 6 విభాగాల్లో 3 నెలల పాటు వివిధ కార్యక్రమాలను అమలు చేయడం, వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించామని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు అందించే పౌష్టికాహారం, ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థ్ధులకు భోజన వసతి, గ్రామాల్లో ప్రజలకు అందుతున్న వైద్యం, వ్యవసాయం, తాగునీరు, తదితర వాటిని కేంద్ర మంత్రి పరిశీలించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు గ్రామస్థాయిలో మంచి ఫలితాలు వస్తున్నాయా లేదా అని కేంద్ర మంత్రులు పర్యటించి అక్కడ వచ్చిన ఫలితాల ద్వారా ఇంకా పేదరికంగా ఉన్న ప్రాంతాలను అభివృద్ధ్ది చేస్తామని అన్నారు. నీతి అయోగ్ ద్వారా గుర్తించి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉందని, రాబోయే రోజుల్లో ఇంకా ఈ కార్యక్రమాన్ని విస్తృత పరచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి వెంట అదనపు కలెక్టర్ బెన్సాలోమ్, ట్రైనీ కలెక్టర్ గరీమా, డిఎస్‌పి లింగయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News