Wednesday, January 22, 2025

బిజెపి నేతల రహస్య సమావేశం: బండి సంజయ్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Bandi Sanjay warning to BJP Rebels on Sescrete Meeting

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపికి చెందిన కరీంనగర్, హైదరాబాద్‌కు చెందిన కొందరు నేతలు అసమ్మతి స్వరం వినిపించడంపై ఆ పార్టీ నాయకత్వం సీరియస్ అయ్యింది. గతంలో హెచ్చరించినా కూడా నేతలు తీరు మారకపోవడంతో పార్టీ నాయకత్వం ఈ విషయమై నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. బుధవారం ఢిల్లీ టూర్‌లో ఉన్న బిజెపి కీలక నేతల బృందం కూడా పార్టీ అగ్రనాయకత్వంతో ఈ విషయమై చర్చించనున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌రావు, వెంకటరమణి, రాములు తదితర నేతలు మంగళవారం హైదరాబాద్ ఓల్డ్ ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బిజెపి కరీంనగర్ జిల్లా పదాధికారుల సమావేశంలో సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ లైన్ తప్పితే ఎంతటి సీనియర్లైనా వేటు తప్పదని హెచ్చరించారు. బుధవారం ఢిల్లీ టూర్‌లో ఉన్న బండి సంజయ్ బృందం పార్టీ అగ్రనాయకత్వంపై ఈ విషయంపై చర్చించే అవకాశం ఉంది. ఒకట్రెండు రోజుల్లో నేతలకు నోటీసు జారీ చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Bandi Sanjay warning to BJP Rebels on Sescrete Meeting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News