Wednesday, January 22, 2025

థియేటర్ లో ‘బలగం’ చూసిన బండి సంజయ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ లో ‘బలగం’ సినిమా చరిత్ర సృష్టించింది. జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. నటుడు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, రూపా లక్ష్మి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధానపాత్రలల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. దిల్ రాజు ప్రొడక్షన్ పై దిల్ రాజు కూతురు హన్షిత, హర్షిత్ రెడ్డిలు నిర్మించిన ఈ మూవీపై సినిమా క్రిటిక్స్, సినీ ప్రముఖులతోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ మూవీని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వీక్షించారు.

సోమవారం అర్టీసి క్రాస్ రోడ్డులోని దేవీ థియేటర్ లో బండి సంజయ్ పార్టీ కార్యకర్తలతో కలిసి ‘బలగం’ మూవీ చూశారు. అనంతరం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ చిత్రయూనిట్ ను అభినందించారు. కాగా, చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘బలగం’ సంచలన విజయాన్ని సాధించింది. అంతేకాదు, ఈ మూవీకి పలు అంతర్జాతీయ అవార్డులు కూడా క్యూ కట్టాయి. ఇప్పటికే తొమ్మిది ఇంటర్ నేషనల్ అవార్డులను ఈ సినిమా దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

నంది అవార్డుల జాప్యంపై స్పందించిన విజయేంద్ర ప్రసాద్

పార్టీ లేదా పుష్ప

ఆర్యగానే స్వీట్ మెమొరీగా నిలిచిపోతావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News