Wednesday, January 22, 2025

ఏమిచ్చారో చెప్పలేక నల్ల పిల్లులనే నమ్ముకున్నారు

- Advertisement -
- Advertisement -

Bandi Sanjay went mad:KTR

పిచ్చోడి చేతిలో
రాయి బిజెపి
రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్‌పై
ట్విట్టర్‌లో
మంత్రి కెటిఆర్
విసుర్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టిఆర్‌ఎస్, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అయితే రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ కుమార్, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్‌లు ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నా రు. అయితే రానురాను ఈ విమర్శల ధాటి పెరుగుతోంది. అయితే శనివారం బండి సంజయ్ విమర్శలు చేస్తున్న వీడియోను మంత్రి కెటిఆర్ పోస్ట్ చేసి.. బండి సంజయ్‌కు పిచ్చి ముదిరిందంటూ పిచ్చాసుపత్రిలో బెడ్ ఖాళీగా ఉందని ట్వీట్ చేశారు. అయితే దానికి కౌంటర్ బండి సంజయ్ ట్వీట్ ద్వారా మరో విమర్శనాస్త్రాన్ని ప్రయోగించారు. అయితే, ఇప్పుడు తాజాగా మంత్రి కెటిఆర్ మ రోసారి ట్విట్టర్ వేదికగా ‘నల్ల పిల్లులు.. తాంత్రికులు, తెలంగాణ కు ఎన్‌డిఎ ప్రభుత్వం ఏమి అందించిందో చెప్పుకోవడానికి ఏమి లేదు. అందుకే ఇటువంటి వాటిపై ఆధారపడవలసి వచ్చింది. ‘పిచ్చోడి చేతిలో రాయి.. లవంగం చేతిలో బిజెపి’ అని ఆయన ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News