Saturday, December 21, 2024

కొత్త సచివాలయం గుమ్మటాలను కూల్చివేస్తాం: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తమ పార్టీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం గుమ్మటాలను కూల్చివేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. జనం గోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజవర్గం ఓల్డు బోయినిపల్లిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ను ఆ పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ నిజాం వారసత్వ సంస్కృతిని ధ్వంసం చేస్తామన్నారు.

నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే హైదరాబాద్ పాతబస్తీలో రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చివేయాలని ఆయన సవాల్ విసిరారు. ఎంఐఎం నాయకుల కళ్ళలో ఆనందం చూసేందుకు సచివాలయాన్ని తాజ్ మహాల్ మాదిరిగా నిర్మించారని ఆయన విమర్శించారు. ప్రగతిభవన్‌ను కూడా ప్రజాదర్బార్‌గా మారుస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్ నుంచే వస్తోందని, ఆ నగరాన్ని ఏమేరకు అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News