Monday, December 23, 2024

Bandi Sanjay: సిఎం కెసిఆర్‌ కు బండి సంజయ్ లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆర్టిజన్లు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక నెలలుగా ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. దాదాపు 23 వేల మందికి పైగా ఉన్న వీరి సమస్యలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. విద్యుత్ శాఖ యాజమాన్యం కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

1999 నుంచి 2004 మధ్య కాలంలో విద్యుత్ సంస్థల్లో నియమితులైన వారికి జిపిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారిపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. వారు సమ్మెలోకి దిగితే రాష్ట్ర పాలనా యంత్రాంగమే కుప్పకూలుతుందని సంజయ్ హెచ్చరించారు. పదవీ విరమణ సహా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్‌లు, పిఆర్సీ, జిపిఎఫ్ వంటి సమస్యలు విషయంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు, ఆర్టి జన్లతో చర్చలు జరపాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News