Sunday, December 22, 2024

సిట్‌కు బండి సంజయ్ లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అతి పెద్ద స్కామ్ అని, దానిని ఉద్యోగులకే పరిమితం చేసి కేసును నీరుగార్చాలని చూస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. రెండోసారి సిట్ నోటీసులపై ఆదివారం ఆయన అధికారులకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తనకు నమ్మకం లేదని, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను హాజరు కాలేకపోతున్నానని వెల్లడించారు.

తనకు ఉన్న సమాచారాన్నే ప్రజలకు చెప్పానని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల ఆధారంగా విచారణ చేపట్టకుండా, ప్రశ్నించిన తనకే నోటీసులు అందించడమేంటని ఆయన ప్రశ్నించారు. కాగా ఆదివారం ఈ విచారణకు ఆయనకు బదులు లీగల్ టీం హాజరైంది. ఈ సందర్భంగా లీగల్ టీం సభ్యుడు రామారావు మాట్లాడుతూ.. బండి సంజయ్ స్థానికంగా అందుబాటులో లేడని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News