Monday, December 23, 2024

పేదల భూముల్లో వ్యాపారం తగునా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించిన అసైన్డ్ భూములను లాక్కుని ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని, దీనిని వెంటనే ఆపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. దళితులు, గిరిజనులకు 3 ఎకరాల సాగుభూమి ఇస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం వమ్ము చేయడంతో ’లక్షలాది మంది ఆశలు అడి యాసలయ్యాయని బండి మండిపడ్డారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు.

సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ వేసింది దళితుల భూముల్లోనేనని బండి ఆరోపించారు. శంషాబాద్‌లో గిరిజన భూముల్లోనేనని సంజయ్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులు, గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. దళితులకు న్యాయబద్ధంగా వచ్చిన భూములకు రక్షణ కల్పించాలని సంజయ్ లేఖలో డిమాండ్ చేశారు. లేకుంటే దళితులు, గిరిజనుల పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని సంజయ్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News