Monday, December 23, 2024

బండి స్థానంలో బిజెపి అధ్యక్షురాలుగా తమిళిసై రావాలి: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

MLA Jeevan reddy was warning to rajagopal reddy

 

కామారెడ్డి : ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పడు గవర్నర్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి మండిపడ్డారు. టిఆర్ఎస్ భవన్ లో ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ఇడి, ఐటి, సిబిఐలను ప్రతిపక్ష నేతలపై ఉసిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ కూడా గవర్నర్లను తమకు అనుకూలంగా ఉపయోగించికుందన్నారు. గవర్నర్ తమిళిసై ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని దుయ్యబట్టారు. ఎక్కడలేని సంప్రదాయాన్ని గవర్నర్ ఇక్కడ తెస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేదొకటి, చేసేదొకటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళసైకి రాజకీయాలు చేయాలని ఆసక్తి ఉంటే బండి సంజయ్ స్థానంలో బిజెపికి అధ్యక్షురాలుగా రావాలని జీవన్ రెడ్డి చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News