Tuesday, December 24, 2024

బండి ఆ 30 మంది పేర్లు బయటపెట్టు లేదా కాంగ్రెస్ పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పు

- Advertisement -
- Advertisement -
టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ డిమాండ్

హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్ పే రోల్‌లో ఉన్నారని, 30 మంది కాంగ్రెస్ నాయకులకు బిఆర్‌ఎస్ పాకెట్ మనీ ఇస్తోందని బండి సంజయ్ ఆదివారం చేసిన అసత్యపు ఆరోపణలను టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ తీవ్రంగా ఖండించారు.బండి సంజయ్ మాటలు కట్టే తుపాకోని మాటలు మరిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రోజు రోజుకు చతికిలబడుతున్న బిజెపిని లేపట్టటానికి కాంగ్రెస్‌పై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

బండి దగ్గర ఆ 30 మంది పేర్లుంటే బయట పెట్టాలి? లేదా కాంగ్రెస్ పార్టీకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై బండి కాంగ్రెస్‌పై నిరాధార ఆరోపణలు చేస్తే ఎక్కడి కెళితే అక్కడ చెప్పులతో సమాధానము చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. బండి సంజయ్ విశ్వసనీయత లేని నాయకుడని, ఆయన పార్టీ నాయకులే ఆయన అసమర్థత పై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వాడిపోతున్న కమలంలో ఆక్సిజన్ గాలి నింపటానికి ఢిల్లీ నుండి రోజుకొక నాయకుడొచ్చినా కమలము రెక్కలు వాడిపోతున్నాయని తెలిపారు. ఆదివారం రాష్ట్రానికి వచ్చిన జె.పి. నడ్డా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కాకుండా, ఒక గల్లీ నాయకుడిగా మాట్లాడారు. ఆయన మాటలలో నిరాశ, నిస్ప్రహలతో పాటు అస్త్రసన్యాసము చేస్తున్నట్టు స్పష్టమైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News