Wednesday, January 22, 2025

పోలీస్ శిబిరంపై బందిపోట్ల దాడి… ఐదుగురు పోలీస్‌ల మృతి

- Advertisement -
- Advertisement -

 

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లోని సింధు రాష్ట్రంలో రోంటీ రీజియన్ కచా ప్రాంతంలోని ఓ పోలీస్ శిబిరంపై దాదాపు 150 మంది బందిపోట్లు దాడి చేసి ఐదుగురు పోలీసులను హతమార్చారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. డీఐజీ జావేద్ జాస్కాని తెలిపిన వివరాల ప్రకారం కచా ప్రాంతంలో దుండగుల ఆక్రమణలు పెరిగిపోవడంతో పోలీసులు క్యాంపు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అయితే ఒక్కసారిగా 150 మంది బందిపోట్లు పోలీస్ పోస్ట్‌పై విరుచుకుపడ్డారు. ఓ డీఎస్‌పి, ఇద్దరు ఎస్‌హెచ్‌ఒలతోపాటు, మొత్తం ఐదుగురు పోలీస్‌లను హతమార్చారు. మృతులు డిఎస్‌పి అబ్దుల్ మాలిక్ భుట్టో, ఎస్‌హెచ్‌ఒ అబ్దుల్ మాలిక్ కమాన్‌గర్, ఎస్‌హెచ్‌ఒ డీన్ ముహమ్మద్ లెహారి, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సలీమ్ చాచాదర్, జటోయ్ పటాఫిలుగా గుర్తించారు. ఈ దాడి సమయంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బందిపోట్లు దాడి చేసినా తమ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీస్ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News