Friday, November 22, 2024

అదే నాకు ముఖ్యం.. టికెట్ వద్దని రేవంత్‌ రెడ్డికి చెప్పా: బండ్ల గణేష్

- Advertisement -
- Advertisement -

ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
టికెట్ వద్దని రేవంత్‌రెడ్డికి చెప్పా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే నాకు ముఖ్యం
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్
హైదరాబాద్: ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కూకట్‌పల్లి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా ఆదివారం స్పందించారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తనకు అవకాశం ఇస్తానని చెప్పారని బండ్ల గణేశ్ గుర్తుచేశారు. తనకు ఈసారి టికెట్ వద్దని రేవంత్‌తో స్పష్టం చేశానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమని, దానికోసం పనిచేస్తానని రేవంత్‌తో వెల్లడించినట్టు ఆయన పేర్కొన్నారు. తనకు టికెట్ ఇస్తానన్న రేవంతన్న ప్రేమకు కృతజ్ఞుడినని. తాను టికెట్ కోసం దరఖాస్తు చేయలేదని, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తన ధ్యేయమని, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ట్విట్టర్ వేదికగా బండ్ల గణేశ్ ట్యాగ్ చేశారు.

తన మనస్తత్వానికి రాజకీయాలు పడవని…
గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి మహాకూటమి తరపున తన సొంత నియోజకవర్గమైన షాద్‌నగర్ నుంచి పోటీ చేయాలని బండ్ల గణేశ్ భావించినా సీటు దక్కలేదు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొన్నిరోజుల పాటు పనిచేసిన బండ్ల గణేష్ గత ఎన్నికల్లో తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన మనస్తత్వానికి రాజకీయాలు పడవని, ఇక అడుగుపెట్టనంటూ ఆయన గతంలో వ్యాఖ్యానించారు. అయితే ఈ మధ్య కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున బండ్ల గణేష్ పోటీలోకి దిగనున్నట్టు వచ్చిన వార్తలపై ఆయన ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కూకట్ పల్లిలో సెటిలర్ల ఓటర్లు ఎక్కువగా ఉండటం, బండ్ల గణేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ సెగ్మెంట్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావించినా ఆయన మాత్రం పోటీ విషయంలో వెనక్కి తగ్గడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News