Wednesday, January 22, 2025

లోక్ సభ టికెట్ కోసం బండ్ల గణేశ్ దరఖాస్తు

- Advertisement -
- Advertisement -

రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంనుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు గాంధీ భవన్ లో దరఖాస్తు అందజేశారు. మల్కాజ్ గిరినుంచే పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కూడా దరఖాస్తు చేశారు. పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంనుంచి పోటీ చేసేందుకు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క భార్య నందిని కూడా ఖమ్మం స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News