Monday, December 23, 2024

కెటిఆర్ నిద్రపోకుండా ఆగమాగం అవుతున్నారు:బండ్ల గణేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై మరోసారి కాంగ్రెస్ నేత సినీ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు చేశారు. వారం రోజుల నుంచి కెటిఆర్ మైకు పట్టుకుంటే ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే భయమవుతుందన్నారు. ఆయన్ను చూస్తుంటే బాధ కూడా అవుతుందని బండ్ల గణేశ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఒక రెండేళ్లలో ప్రభుత్వాన్ని పడగోడుతామని, త్వరలోనే సిఎం కెసిఆర్ అవుతారని అంటున్నారని కెటిఆర్ వ్యాఖ్యలను బండ్ల గణేశ్ గుర్తు చేశారు. అయితే వచ్చే ఆంధ్రప్రదేశ్ లేదా మహారాష్ట్ర, కేరళ ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయండని ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. నలుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే కెటిఆర్ ఉలిక్కిపడి నిద్ర పోకుండా ఆగమాగం అయిపోయి ఏదో కొంపలు మునిగిపోయినట్లు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News