Wednesday, January 22, 2025

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం మొదలయ్యింది: బండ్ల గణేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం మొదలయ్యిందని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు డిసైడయ్యారని సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియా తో మాట్లాడారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ మాటే వినిపిస్తోందని అన్నారు. ఇప్పుడు షాద్ నగర్ పోయిన, మిత్రుడు వీర్లపల్లి శంకర్ నామినేషన్ వేస్తే ఊరు దాటడానికి గంట పట్టింది, జనాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని ఆయనన్నారు. సోషల్ మీడియాని నాయకులను మేనేజ్ చేయచ్చు కాని ప్రజలను మేనేజ్ చేయలేరని పేర్కొన్నారు. ప్రజలు నవంబర్ 30 కోసం ఎదురు చూస్తున్నారని,

కాంగ్రెస్ అద్భుతం స్తృష్టిస్తుందని ఆయనన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలు నేరవేరుస్తామన్నారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ త్యాగాలు చేసిందని, దేశం కోసం రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీ సేవ చేస్తున్నారని తెలిపారు. అన్నిటికి తెగించి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింద చెప్పారు. రాహుల్ గాంధి తెలంగాణాలోనే మాకాం వేయనున్నారని తెలిపారు. డిసెంబర్ 9 ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నామని బండ్ల గణేష్ చెప్పారు. నేను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్త ని, ఇంత వరకు కాంగ్రెస్ కి తప్ప వేరే పార్టీకి ఓటేయలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News