Sunday, December 22, 2024

రేవంత్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారు

- Advertisement -
- Advertisement -

ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన సినీ నటుడు బండ్ల గణేష్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా నెలరోజులు పూర్తయిన సందర్భంగా సినీ నటుడు బండ్ల గణేష్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్)లో ఆయన ఓ వీడియో పెట్టారు. ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినా రేవంత్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు.

వచ్చే ఐదేళ్లలో భారత్‌లో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని నమ్మకం కలుగుతోందన్నారు. ఇప్పుడు తెలంగాణలో దొరతనం లేదని ప్రతి ఒక్కరూ నిజాయితీగా, ఆనందంగా ఉంటున్నారని ఆయన తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో పాలన మరింత అద్భుతంగా ఉండబోతోందని ఆయన జోస్యం చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News