Friday, December 20, 2024

‘యూ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’.. సిఎం కెసిఆర్‌పై బండ్ల గణేష్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ అమూల్యమైన సేవలు ఈ దేశానికి అవసరం అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. యాదగిరి నరసింహస్వామి ఆలయం చూసిన తర్వాత ఈ రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతిపథం వేపు నడిపించే సత్తా, సామర్థం కెసిఆర్‌కు ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నానని బండ్ల గణేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తన కుటుంబంతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం కెసిఆర్ పరిపాలనను ప్రశంసిస్తూ గణేశ్ వరుస ట్వీట్లు చేశారు. ‘ఎన్నో రోజుల నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాని కోరిక ఉన్నా, ఆ స్వామివారి అనుగ్రహం లేక నాకు రావటం కుదరలేదు.

కానీ మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా వచ్చి ఆ యాదగిరి నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆలయాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి కెసిఆర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక కతజ్ఞతలు. తెలంగాణ అద్భుతమైన ప్రగతి పథం వైపు దూసుకుపోతుంది అని చెప్పటానికి ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధి ఓ నిదర్శనం. కెసిఆర్ ఆలోచన, ఆచరణ ఇవే కాకుండా వాటిని నిర్మిస్తున్న ప్రాజెక్టులు గాని ఆయన ఆలోచన విధానంగానీ మహా అద్భుతంగా తృప్తి చెందాను. చాలా సంతోషం అనిపించింది.. ముఖ్యమంత్రి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయలేకుండా ఉండలేక పోతున్నాన’ని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News