Monday, December 23, 2024

రాజకీయాలకు బండ్ల గణేశ్ గుడ్ బై..

- Advertisement -
- Advertisement -

 Bandla Ganesh says goodbye to Politics

మన తెలంగాణ/హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్, వ్యాపార పనుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బండ్ల గణేశ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం కానీ, మిత్రత్వం కానీ లేవని స్పష్టం చేశారు. తనకు అందరూ ఆత్మీయులేనని, అందరినీ సమానంగా చూస్తానని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎవరైనా తన వల్ల ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని బాధపడి ఉంటే తనను పెద్ద మనసుతో క్షమించాలని బండ్ల గణేశ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయం చవిచూడగా, ఆ తర్వాత బండ్ల గణేశ్‌క పెద్దగా రాజకీయాల్లో పాల్గొన్నది లేదు.

 Bandla Ganesh says goodbye to Politics

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News