Wednesday, January 22, 2025

మతిభ్రమించి మల్లారెడ్డి ఆరోపణలు:బండ్ల గణేశ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ మంత్రి మల్లారెడ్డిపై బండ్ల గణే ష్ ఫైర్ అయ్యారు. మతిభ్రమించి మల్లారెడ్డి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారని బండ్ల గణేశ్ ఆరోపించారు. విద్యార్థుల రక్తాన్ని పీల్చి ఫీజులు వసూల్ చేస్తున్నారని బండ్ల గణేశ్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి ఎంపి స్థానం నుంచి పోటీ చేసేందుకు గాంధీభవన్‌లో బండ్ల గణేశ్ శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ రెండు నెల ల రేవంత్‌రెడ్డి పరిపాలన గురించి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా తాను గర్వపడుతున్నానని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీగా తెలంగాణను పరిపాలన అందిస్తున్నారని ఆయన తెలిపారు. రెండు నెలల రేవంత్‌రెడ్డి పాలన అద్భుతమని, రాబోయే అన్ని ఎంపి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని బండ్ల గణేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తగా రేవంత్ రెడ్డి పాలనను చూసి గర్వపడుతున్నానని బండ్ల గణేష్ అన్నారు. పార్టీ తనకు మల్కాజిగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తే తప్పకుండా గెలుస్తానన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే తీసుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. డబ్బులున్నాయని అహంకారమా? అంటూ మల్లారెడ్డిపై ఆయన మండిపడ్డారు. గోవాలో వెళ్లి వ్యాపారం చేసుకోవాలని మల్లారెడ్డికి ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News