Tuesday, September 17, 2024

‘గబ్బర్ సింగ్’ ఒక చరిత్ర.. మా జీవితాలను మార్చేసింది. హరీష్ శంకర్

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ క్రేజీ కాంబోలో చరిత్ర సృష్టించిన మూవీ ‘గబ్బర్ సింగ్’. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం 2012లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ‘గబ్బర్ సింగ్’ రీరిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో రీ-రిలీజ్ ప్రెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది.

రీరిలీజ్ ప్రెస్‌మీట్‌లో నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ “నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు బ్రతుకుని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి నేను ఎంత చెప్పుకున్నా తక్కువే. నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు ఈ క్రేజ్, పేరు ఉండేది కాదు. ఆయన ఒక రోజు పిలిచి సినిమా నిర్మించే అవకాశం ఇచ్చారు. నన్ను నేను నమ్మలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ నమ్మారు. ఎవరు ఎన్ని చెప్పినా.. ‘గణేష్ కి మాటిచ్చాను. తనతో సినిమా చేస్తాను’అని నన్ను నిర్మాతగా నిలనెట్టారు. గబ్బర్ సింగ్ ఒక చరిత్ర. రీ రిలీజ్‌కి ఇంత క్రేజ్ ఏంటని కొందరు అడుగుతున్నారు. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎంత పవిత్రమైనదో పవన్ కళ్యాణ్ అభిమానులకు గబ్బర్ సింగ్ అంత పవిత్రమైనదని వారికి చెప్పాను. గబ్బర్ సింగ్ సినిమాని అణువణువునా ప్రతి అడుగు ప్రతి మాట ప్రతిక్షణం ప్రతి కష్టం డైరెక్టర్ హరీష్ శంకర్ కి చెందుతుంది. హరీష్ శంకర్ ఏది చెప్తే అది చేద్దాం అని పవన్ కళ్యాణ్ సినిమా ప్రారంభమైన రోజునే చెప్పారు. హరీష్ శంకర్ రాబోయే పాతికేళ్ళు తెలుగు సినిమాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా వుంటారు. పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఆయన గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి. నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి. భారతదేశంలో ఏ నటుడు పొందలేనంత అత్యధిక రేమ్యునిరేషన్ పొందగలిగే స్టార్ అయినప్పటికీ హాయిగా బ్రతికే సామర్థం ఉన్న పవన్ కళ్యాణ్ అన్నీ వదిలేసి జనం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. దాదాపు 10ఏళ్లు ప్రజల కోసం పోరాడి ఈ రోజు ఒక స్థాయికి వచ్చారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం వున్న పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ సినిమా తీయడం నా అదృష్టం”అని అన్నారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ “సోషల్‌మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈరోజుల్లో ‘గబ్బర్‌సింగ్’ రిలీజ్ అయితే ఎంత బాగుండేదో అని నా మనసులో ఎప్పటినుంచో ఒక చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. అప్పుడు మిస్ అయిన డిజిటల్ హంగామాని మళ్ళీ క్రియేట్ చేసి ఇస్తున్న మా అన్న గణేష్‌కి, సత్యనారాయణకి థాంక్ యూ. ‘గబ్బర్ సింగ్’ అంటే ఒక చరిత్ర. మా జీవితాలను మార్చేసిన చిత్రమిది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, యాక్టర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News