Sunday, December 22, 2024

భవిష్యత్‌లో అమెరికా ప్రెసిడెంట్ ఒక కమ్మ వాడు అయ్యే అవకాశం ఉంది:బండ్ల గణేష్

- Advertisement -
- Advertisement -

భవిష్యత్‌లో అమెరికా ప్రెసిడెంట్ ఒక కమ్మ వాడు అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. తాజాగా మాదాపుర్‌లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్‌లో ఆయన ప్రసంగించారు. దేశ, విదేశాల్లోని అన్ని ప్రాంతాలకు కమ్మ వాళ్లు విస్తరించారని ఆయన చెప్పుకొచ్చారు. బోరులో పడ్డ బయటకు రాగల కెపాసిటీ ఉన్నవాడే కమ్మ వాడు అని ఆయన అన్నారు. కమ్మ వాడికి మోసం, అన్యాయం చేయడం రాదని,

కమ్మ వాడికి కష్ట పడటం ఒకటే వచ్చన్నారు. కమ్మ వాడిగా పుట్టినందుకు గర్విస్తానని, కమ్మ వాడిగా పుట్టినందుకు ఆనందిస్తానని ఆయన పేర్కొన్నారు. మన కమ్మ కులంలో లేని పిల్లలను ఆదుకొని సాయం చేయండని, అప్పుడే మన కులం ఉన్నత స్థాయిలో ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కమ్యూనిటీలో కష్టపడే యువకులకు భవిష్యత్ ఇవ్వాలని ఆయన సూచించారు. రవి అస్తమించని ప్రతి దేశంలో కమ్మ వాడు జెండా ఎగరేస్తున్నాడని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News