Sunday, December 22, 2024

బండ్లగూడలో భార్య గొంతుకోసి… తగలబెట్టిన భర్త

- Advertisement -
- Advertisement -

భాగ్యనగరం: హైదరాబాద్ లోని పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను భర్త హత్య చేశాడు. హస్మా బాద్ ఖాద్రియా మసీద్ వద్ద భార్య గొంతు కోసి అనంతరం మృతదేహాన్ని భర్త తగులబెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బండ్లగూడలో ఫైజ్ ఖురేషి (28) ఆటోను నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆరు సంవత్సరాల క్రియంతో పిసల్ బండాకు చెందిన ఖమర్ బేగమ్(24) ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి దంపతులు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తితో భార్య గొంతు కోసి అనంతరం మృతదేహాన్ని తగలబెట్టాడు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో భర్త లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News